ఫొటో : సన్మానం చేస్తున్న స్నేహితులు.
నెన్నెల, జనవరి 18, (జనంసాక్షి )
నెన్నెల మండలం నందుల పల్లి గ్రామానికి చెందిన దుర్గం శివ పీహెచ్డీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు. 1998-99 సంవత్సరంలో నెన్నెల జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. ఈసందర్భంగా డాక్టరేట్ పొంది ప్రొఫెసర్ గా వృత్తిపరంగా ఎదిగిన శివను పదవ తరగతి తోటి విద్యార్థులు పూల మాలలు వేసి శాలువాసన్మానించారు. ఈకార్యక్రమంలో మన్నెగూడెం సర్పంచ్ గొర్లపల్లి బాపు, మిత్ర బృందం మీనుగు మారయ్య, గట్టు నారాయణ, మల్లేష్, శంకర్, రవి, తైదల సమ్మయ్య, రామడుగు రాకేష్, వెంకటేష్, షేక్ అమర్, బషీర్, సేని స్వామి, తోట బాపయ్య, శ్రీనివాస్, రాజమౌళి పాల్గొన్నారు.
డాక్టరేట్ పొందిన స్నేహితునికి సన్మానం.




