Wednesday, 4 November 2026

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం….!

జనం సాక్షి,చెన్నారావుపేట

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని అక్కల్ చెడ గ్రామ శివారు హర్యానాయక్ తండాలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…ఇదే తండాకు చెందిన లావుడ్య రజిత-దేవ్ సింగ్ అనే భార్యాభర్తలు రోజు వారి మాదిరిగానే సోమవారం ఉదయం కూలి పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో పూరి గుడిసెలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో పూరి గుడిసె మొత్తం దగ్ధమైంది. దీంతో ఇంట్లో ఉన్న 12 క్వింటాళ్ళ పత్తి, 4 తులాల వెండి, బంగారం, రూ. 80 వేల నగదు, విలువైన వస్తు సామగ్రి, బియ్యం, దుస్తులు మొత్తం కాలి బూడిదయ్యాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే సమాచారం అందుకున్న నర్సంపేట అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. పూరి గుడిసె కాలిపోవడంతో నిరుపేద కుటుంబం రోడ్డున పడిందని ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ తూటి పావని రమేష్,ఉప సర్పంచ్ బానోతు వీరన్న లు, గ్రామస్తులు కోరారు.