Wednesday, 4 November 2026

జంగీపూర్‌, తెహ్రీ లోక్‌సభ ఎన్నికలు కౌంటింగ్‌ ప్రారంభం

కోల్‌కత్త : పశ్చిమబెంగాల్‌ లోని జంగీపూర్‌ , ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ లోక్‌సభ నియోజకవర్గలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా భాద్యతలు చేపట్టి జంగీపూర్‌ లోక్‌సభకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ నియోజకవర్గం  నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రణబ్‌ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ పోటీ పడుతున్నారు. తెహ్రీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌బహుగుణ కుమారుడు సాకేత్‌ బరిలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో బుధవారం ఎన్నికలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *