జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రములో పంచాయతీ జేపియస్, ఓపియస్ ల శాంతియుత నిరవధిక సమ్మెకు బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి బుధవారం సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జూనియర్ ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని, ఓపిఎస్ ను వెంటనే జెపిఎస్లుగా కన్వర్ట్ చేసి, వెంటనే రెగ్యూలర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్య దర్శులకు న్యాయం చేసే వరకు బిజెపి పార్టీ పక్షాన అండగా నిలబడతామని సునీల్ రెడ్డి అన్నారు.




