వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 6 జనం సాక్షిజగత్ రక్షకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దీవెనలతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు వారి సతీమణి తో కలిసిడాక్టర్ మెతుకు సబితా ఆనంద్ హనుమాన్ జయంతి సందర్బంగా అనంతగిరి బండ బావి శ్రీ ఆంజనేయ స్వామి* వారి పల్లకి సేవలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిరామయ్యగూడలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి కౌన్సిలర్లు అనంతరెడ్డి గోపాల్ ప్రభాకర్ రెడ్డి సురేష్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి సుభాన్ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ రవీందర్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




