బెల్లంపల్లి, ఏప్రిల్ 6, (జనంసాక్షి )బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పథకం ప్రకారమే ప్రశ్న పత్రాల లీకేజ్ కు పాల్పడి విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడని నిరసిస్తూ గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తాలో బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో టిఎస్పిఎస్సి పరీక్ష పత్రాల లీకేజ్ లోను, ఇటు పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ లోను బీజేపీ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. పథకం ప్రకారం పరీక్ష పత్రాలను లీకేజ్ చేస్తూ విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని వారు ఆరోపించారు. బీజేపీ పార్టీ, బండి సంజయ్ కుట్రలకు నిరసనగా బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశామని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు సురేష్, అస్మా యూసుఫ్, నీలి కృష్ణ, గడ్డం అశోక్, మాటూరి మధు, గోసిక రమేష్, రాములు నాయక్, కో అప్షన్ సభ్యులు ఏలూరి వెంకటేష్, వాజిద్, పట్టణ బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రెవెల్లి విజయ్, అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి, నాయకులు సత్యవతి, కిరణ్, అన్వర్, సన్నీ బాబు, శ్రావణ్, యూనుస్, శ్రీధర్, మధు, పోలు శ్రీనివాస్, ఎలిగేటి శ్రీనివాస్, మంగమూర్తి, జిలకర వాసు, కేంశెట్టి శ్రీనివాస్, శంకర్ సింగ్, సూరం బానేష్, భీమా శంకర్, శివ, అలీ తదితరులు పాల్గొన్నారు.




