Wednesday, 4 November 2026

పదో తరగతి విద్యార్థులకు ఆటో సేవలు.

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 6, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆటో సేవలు అందిస్తున్నట్లు బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కట్టా రామ్ కుమార్ తెలిపారు. గత మూడు పదో తరగతి పరీక్షలకు ఉచితంగా సేవలు అందించామని వివరించారు. మిగితా పరీక్షలకు సైతం పట్టణంలోని బెల్లంపల్లి కాంట చౌరస్తా, కన్నాల బస్తీ, సుభాష్ నగర్, చౌడేశ్వరి, పాత బస్టాండ్, హనుమాన్ బస్తీ వద్ద నుంచి ఉదయం 8 నుంచి 9:30 వరకు విద్యార్థులకు ఉచిత ఆటో సేవలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించు కోవాలన్నారు.