Tuesday, 3 November 2026

జగన్మోహినిగా లక్ష్మీనరసింహుడు

నల్లగొండ : నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టలో లక్ష్మీనర్సింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామివారు జగన్మోహిని అవతారంలో తిరుమాడ వీధుల్లో విహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు గుట్టకు తరలివచ్చి.. కన్నుల పండువగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. బ్రహ్మోత్సవాలు ఏడో రోజుకు చేరుకోవడంతో హోమాలు, పూజలు, అలంకారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు అలంకారోత్సవం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రికి జరగనున్న ఎదుర్కోలు ఉత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *