రైల్వే బడ్జెట్ ఈసారి రాష్ర్టాన్ని పూర్తిగా నిరాశపరిచినా.. గుడ్డిలో మెల్లలా రెండు కొత్త లైన్ల కోసం సర్వే చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట- వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మధ్య, ఖమ్మం జిల్లా కొత్తగూడెం- కిరండోల్ మధ్య కొత్త లైన్ల సర్వేకు పచ్చజెండా ఊపింది. సికింద్రాబాద్-మహబూబ్ నగర్ మధ్య 108 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. ఇది సాధించినందుకు గర్వంగా ఉందని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.




