Thursday, 5 November 2026

జగన్‌కు ఏపీలో..  పోటీచేసే అర్హత లేదు

– ఏపీ పోలీసులను నమ్మనని అనడం విడ్డూరం
– పాదయాత్రలో జగన్‌కు భద్రత ఇచ్చింది ఏపీ పోలీసులే
– సానుభూతి కోసమే జగన్‌ నాటకాలాడుతున్నాడు
– గాయపడ్డ షర్ట్‌ ఎక్కడుందో జగన్‌ చెప్పాలి?
– ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు
విజయవాడ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : జగన్‌ తనపై జరిగిన దాడిని రాజకీయంగా ఉపయోగించుకొనేందుకు డ్రామాలాడుతున్నారని, ఏపీ పోలీసులు, అధికారులపై నమ్మకం లేదని చెబుతున్నఆయనకు ఏపీలో పోటీ చేసే హక్కు లేదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి నక్కా ఆనందబాబు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా టీడీపీ ఆఫీసులో రూ.5లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం రామనపూడిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని మంత్రి నక్కా ఆనందబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దాడి జరిగిన సమయంలో జగన్‌ తీరు చూస్తుంటే కావాలనే సానుభూతితో దాడి చేయించుకున్నట్లు అనుమానాలు వస్తున్నాయని అన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స తీసుకోవాలని, అలాకాకుంగా ఆయన నవ్వుతూ విమానం ఎక్కి వెళ్లిపోవడమేంటని నిలదీశారు. కత్తిదాడి జరిగితే ఎవరైనా కంగారు పడతారని, కానీ జగన్‌లో ముందుగానే ప్లాన్‌ చేసుకోవటం వల్ల ఏవిూకాదులే అని తెలుసు కాబట్టి ఎలాంటి ఆందోళన
ఏదీ కనిపించలేదన్నారు. దాడి జరిగి ఐదు రోజులైనా జగన్‌ స్పందించలేదని.. విూడియా ఎదుట మాట్లాడితే నిజాలు బయటపడతాయని కంగారు పడుతున్నారని అన్నారు. జగన్‌కు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటే ఆయన్ను ఏమనాలో అర్థం కావటంలేదని మంత్రి అన్నారు. జగన్‌ 3వేల కిలోవిూటర్లకు పైగా పాదయాత్ర చేసినప్పుడు ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ భద్రత కల్పించింది ఏపీ పోలీసులేనని మంత్రి గుర్తుచేశారు. ఆ విషయాన్ని మర్చిపోయిన జగన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. సీబీఐని కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అని విమర్శించిన వైకాపా నేతలు జగన్‌పై దాడి ఘటనను ఆ సంస్థతోనే విచారణ జరిపించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. పాదయాత్రలో ప్రజాదరణ లేకపోవడంతో వైకాపాలో ఆందోళన నెలకొందని, అందువల్లే తెదేపాపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌పై దాడి జరిగిన వెంటనే వైకాపా నేతల కంటే ముందే భాజపా నేతలు స్పందించడాన్ని బట్టే వారి మధ్య ఉన్న బంధం అర్థమవుతోందన్నారు. కేసులో ప్రాథమి ఆధారాలు ధ్వంసం చేశారని అన్నారు. గాయపడ్డ సమయంలో వేసుకున్న షర్ట్‌ ఎక్కడుందో చెప్పాలని, ఆధారాలు పోలీసులకు ఇవ్వకుండా జగన్‌ దాస్తున్నాడని, వాస్తవాలు చెప్పడానికి జగన్‌ ఎందుకు భయపడుతున్నాడని నక్కా ఆనంద్‌బాబు ప్రశ్నించారు. జగన్‌ తన తీరును మార్చుకొని ఏపీ పోలీసులకు విచారణకు సహకరించాలని సూచించారు.