– బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు
– ముద్దులు, సెల్ఫీలు, సొంత విూడియాలో డబ్బా.. ఇదే జగన్ పాదయాత్ర
– పాదయాత్ర ఆపి.. కేంద్రంపై, రాష్ట్రంలోని సమస్యలపై పోరాడు
– ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
అమరావతి, నవంబర్13(జనంసాక్షి) : మోడీ అంటేనే జగన్కు భయం పట్టుకుందని, మోడీని ఒక్క మాట అన్నా తనను తీసుకెళ్లి జైళ్లో పెడతారని జగన్ మోడీ గురించి పల్లెత్తు మాట అనడం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. జగన్ పాదయాత్ర వల్ల ఏపీకి రాగి దమ్మిడి అంత ప్రయోజనం కూడా లేదని ఆయన విమర్శించారు. సీమాంధ్ర స్వర్ణాంధ్ర కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని ఎన్నో రావాల్సి ఉందని అన్నారు. వీటిపై పార్లమెంటు, అసెంబ్లీ లోపలా, బయటా పోరాటం చేయాలని అన్నారు. అయితే పార్లమెంటుకు రాజీనామాలు చేయడం, అసెంబ్లీని బహిష్కరించడం ద్వారా పోరాడే అవకాశాన్ని వైసీపీ కోల్పోయిందని అన్నారు. పాదయాత్రలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించడం లేదని, బీజేపీని పల్లెత్తు మాట కూడా అనడం లేదని తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీకి భయపడుతున్నారని అన్నారు. కడప పౌరుషానికి, ఢిల్లీ మధ్య పోటీ అని గతంలో జగన్ చెప్పారని, ఇదేనా కడప పౌరుషం అని ఆయన ఎద్దేవా చేశారు. రోజుకు 10 కిలోవిూటర్లు నడవడం, ముద్దులు పెట్టడం, సెల్ఫీలు తీసుకోవడం, సొంత టీవీ, పత్రికలో డబ్బాలు కొట్టుకోవడం… ఇదే పాదయాత్ర దినచర్య అని అన్నారు. జగన్ పాదయాత్ర కోసం రోజుకు రూ. 2 కోట్లు ఖర్చు అవుతోందని చెప్పారు. ఈ మాత్రం దానికి పాదయాత్ర అవసరమా అని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా పాదయాత్రను ముగించుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఆర్థిక భారం వేయడాన్ని ఆపేయాలని సూచించారు. పాదయాత్రను ఆపేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం విూద, రాష్ట్ర సమస్యల విూద పోరాటం చేస్తే మంచిదని తులసిరెడ్డి హితవు పలికారు.




