కర్నూలుఅక్టోబర్31(జనంసాక్షి): విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కత్తి దాడి జరిగితే ఆయనను సీఎం చంద్రబాబు పరామర్శించకపోవడం తప్పే అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. జగన్‌పై దాడి కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, తుఫాన్‌తో ఉత్తరాంధ్ర నష్టపోయిందన్నారు. తితలీ తుఫాన్ ప్రభావంపై కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరమని…అసలు ఏపీ ప్రజలు దేశంలో లేనట్లు మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వచ్చేనెల 3న విజయవాడలో వామపక్ష పార్టీల సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చర్చిస్తామని రామకృష్ణ తెలిపారు.
జగన్‌ను బాబు పరామర్శించాల్సింది: రామకృష్ణ




