Thursday, 5 November 2026

జగన్‌ అభివృద్ది నిరోధకుడు : జివి

గుంటూరు,జూలై12(జ‌నం సాక్షి): అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్‌కు 2019 ఎన్నికలలో పుట్టగతులు ఉండవని గుంటూరు టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. చిన్న పదవికి ఎన్నుకోవాలంటే గుణగణాలను పరిశీలించే మనం జగన్‌కు ఉన్న 12 కేసుల మచ్చలను గుర్తించాలని వివరించారు. వర్షాలు పడ్డ, నాగార్జునసాగర్‌ నిండినా తట్టుకోలేని స్థితిలో ఆయన ఉన్నారని తెలిపారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌ ఎన్ని అవాంతరాలు సృష్టించినా పట్టువదలని విక్రమార్కుని వలే పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో జరిగే అభివృధ్ధి పనులను అడ్డుకోవడమే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పనిగా ఉందని ఆరోపించారు. రుణమాఫీని అడ్డుకునే పని, అంగన్‌వాడీలను,విద్యార్థులను రెచ్చగొట్టడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారని అన్నారు.