Wednesday, 4 November 2026

న్యాల్కల్ లో ఘనంగా పాత పంటల జాతర

 

 

 

 

 

 

 

జహీరాబాద్ ఫిబ్రవరి 8 (జనం సాక్షి ) న్యాలకల్ : మండల కేంద్రంలో బుధవారం డిడి ఎస్ ఆధ్వర్యంలో పాత పంటల జాతర ను ఘనంగా నిర్వహించారు ఏండ్ల బండ్ల తో గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.జాతరకు వచ్చిన అతిధుల చేత జ్యోతి ప్రజ్వలన మరియు మహిళా రైతులు చిరుధాన్యాలపై పాడిన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పాత పంటల ప్రాముఖ్యత పై వివరించారు పాత పంటల వల్ల కలిగే లాభాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ డీడీ ఎస్ కో ఆర్డినేటర్ వినయ్ కుమార్ జాతర కు పరిచయం చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షురాలు అంజమ్మ , సర్పంచ్ శివ శంకరయ్య స్వామి, ఎంపీటీసీ సంగమ్మ, ఎంపిడిఓ వెంకట్ రెడ్డి,సిబ్బంది చుక్కమ్మ,నర్సమ్మ, చంద్రమ్మ, కమలమ్మ,బాలన్న వినయ్ కుమార్ తక్కారెడ్డి, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.