జగ్గాసాగర్ గ్రామాన్ని మండలం కేంద్రంల గా ప్రకటించలని ధర్నా*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 08, జనంసాక్షి:
గత 120 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్న జగ్గాసాగర్ గ్రామస్తులు నిన్న జగిత్యాలలో జరిగిన సీఎం కేసీఆర్ సభలో బండలింగాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడంతో జగ్గాసాగర్ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అన్ని వసతులు కలిగిన జగ్గాసాగర్ గ్రామాన్ని
మండల కేంద్రంగా ప్రకటించాలని
మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ధర్నా చేస్తూ ఆందోళన చేపట్టారు సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది
పట్టు వదలని గ్రామస్తులు ఎమ్మెల్యే వచ్చి మా గ్రామాన్ని మండల కేంద్రంగాప్రకటించేలా చేయాలని ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలని పట్టుదలతో జగ్గాసాగర్ మండలం జేఏసీ నిరాశనకు కూర్చోవడం జరిగింది. ఎమ్మార్వో నడిమెట్ల సత్యనారాయణ మరియు సీఐ రాజశేఖర్ రాజు,ఎస్సై సధాకర్,ట్రాఫిక్ ఎస్ ఐ ఎల్ రాము,గ్రామస్తులకు న్యాయం జరిగేలా చేస్తామని ధర్నాను విరమింప చేశారు
జగ్గాసాగర్ గ్రామాన్ని మండలం కేంద్రంల గా ప్రకటించలని ధర్నా




