దేశ అభివృద్ధి భాజపాతోనే సాధ్యం…
– భాజపా నాయకులు రామారావు పాటిల్.
భైంసా రూరల్ డిసెంబర్ 08 జనం సాక్షి
దేశ అభివృద్ధి భాజపా ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని బిజెపి నాయకులు రామారావు పటేల్ అన్నారు.గుజరాత్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో 151 స్థానాలలోగెలిచిన సందర్బంగా గురువారం విజయోత్సవ సంబరాలను తన అనుచర వర్గంతో భైంసా పట్టణ0లోని తన నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి స్వీట్లు పంచారు. అనంతరం మాట్లాడుతూ… గుజరాత్ రాష్ట్రంలో 182 సీట్లకి బిజెపి పార్టీ అత్యధికంగా 151 సీట్లు గెలుచుకొని 7 వ సారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని. దేశ అభివృద్ధికి భాజపా ప్రభుత్వం ఎంతో తోడుపడుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో భాజపానాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




