పైలెట్ కుట్టు మిషను శిక్షణ కేంద్రాన్ని ప్రారంభం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బషీరాబాద్ డిసెంబర్ 08, (జనం సాక్షి)
బషీరాబాద్ మండల కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత కుట్టుశిక్షణ కేంద్రాన్ని గురువారం రోజున స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో తాండూరు నియోజకవర్గంలోమహిళల ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడంలోనూ ఒక విజన్‌తో ముందుకు సాగుతున్నామన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి విరివిగా రుణాలను మంజూరు చేయిస్తూ మహిళలు అభివృద్ధి చెందాలని ప్రస్తుతం మండల కేంద్రంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మహిళలు స్వయం కృషితో ఎదగాలని, కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలనేదే నా లక్ష్యం అని చెప్పారు. మహిళలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శకుంతల, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాము నాయక్, ఎంపీటీసీ రేఖాపవన్ ఠాకూర్, ఏఎంసీ వైస్ చైర్మైన్ రవీంధర్ సింగ్ తన్వార్, పీఏసీఎస్ చైర్మైన్ వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు రెడ్డి (నర్సిరెడ్డి), రఘుమ రెడ్డి, కో అప్షన్ మెంబర్ అబ్దుల్ రజాక్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
పైలెట్ కుట్టు మిషను శిక్షణ కేంద్రాన్ని ప్రారంభం ఎమ్మెల్యే




