జనం సాక్షి, కమాన్ పూర్: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు ఆధ్వర్యంలో భారత దేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా గురువారం కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మల్యాల తిరుపతి మాట్లాడుతూ.. మంథని కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణలో పుట్ట మధు మాట్లాడిన తీరు దళిత జాతిని అవమానించినట్టుగా.. వారి మనోభావాలు దెబ్బ తినే విధంగా దళిత జాతి బిడ్డయినటువంటి బాబు జగ్జీవన్ రామ్ బ్రాహ్మణ సమాజానికి చెందిన బిడ్డగా మాట్లాడడం జరిగిందని, రాజకీయాలలో కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్న పుట్ట మధు దళిత బిడ్డ అయినటువంటి బాబు జగ్జీవన్ రామ్ విషయంలో మాట్లాడిన తీరుకు మంతిని నియోజకవర్గ దళిత బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ , గాండ్ల మోహన్ , జిల్లా కార్యదర్శి సయ్యద్ అన్వర్, మల్యాల తిరుపతి, ఎండి అప్సర్, కొంతం శ్రీనివాస్, సయ్యద్ ఇక్బాల్, ఇరుగురాల శేఖర్ , కోలా నరేందర్ నాయకులు చొప్పరి శేఖర్ నగునూరి నర్సయ్య, మాతంగి సదానందం, ఎండి లల్లు యూసఫ్ దాసరి రాజేష్ ఇనగంటి ప్రభాకర్ రావు ఎనగంటి నరేందర్ రావు ఎండి ముస్తాక్, కుక్క రవి, చాట్ల రాయమల్లు, ఇనగంటి పాపారావు, మట్ట నరసయ్య, ఎండి రహీం, తూముల కనకయ్య, మద్దెల రాజయ్య, మామిడి రాజు, ఎజ్జ గంగయ్య , కోటగిరి రాజయ్య , కోలేటి రమేష్ , దాసరి రాజేష్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జగ్జీవన్ రావుకు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు




