ధర్మపురి (జనం సాక్షి) డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి గురువారం ఉదయం కాంగ్రెస్ కార్యాలయంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు,జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు
జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్ మాట్లాడుతూ
బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, దేశంలో వ్యవసాయ రంగం ఇంత పురోగతి సాధించిందంటే అది జగ్జీవన్ రామ్ ముందుచూపు వల్లేనని,ఆయన నడిచిన బాట,అనుసరించిన ఆదర్శాలు, చూపిన సంస్కరణ మార్గాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బి.సి సెల్ అధ్యక్షుడు మల్లేష్, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రఫియొద్దిన్,టౌన్ యూత్ అద్యక్షుడు అప్పం తిరుపతి,టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోచయ్య,నరేష్ తదితరులు పాల్గొన్నారు.




