
వికారాబాద్ రూరల్ జూలై 6 జనం సాక్షి
గత 2 సంవత్సరాలుగా వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ గా సేవలందించిన మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్రబండ్లగూడ కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఈరోజు *తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ వైస్ చైర్ పర్సన్ మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది అందరూ కలిసి కమిషనర్ గారిని శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ కమిషనర్ శరత్ చంద్ర గత 2 సంవత్సరాల పాటు వికారాబాద్ అభివృద్ధిలో ఎంతో సహకరించారని, ఇప్పుడు వెళ్లే బండ్లగూడ మున్సిపల్ అభివృద్ధిలో కూడా క్రియాశీలకంగా పని చేసి అక్కడి ప్రజల ప్రశంసలు అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు సురేష్ అర్ద సుధాకర్ రెడ్డి వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ కౌన్సిలర్లు చింతకింది రామస్వామి, కృష్ణారెడ్డి, చందర్ నాయక్, అనంత్ రెడ్డి, గోపాల్, జైదుపల్లి మురళి, నాయకులు రెడ్యానాయక్, రాజేందర్ గౌడ్, వివిధ విభాగాల అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొని కమిషనర్ శరత్ చంద్ర కి ఘనంగా వీడ్కోలు తెలిపారు.




