జనంసాక్షి , రామగిరి : పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో సిసి రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. సర్పంచ్ లావణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముస్త్యాల గ్రామానికీ సిడిపి పండ్ నుండి నిధులు రూపాయలు ఐదు లక్షలు గ్రామ పంచాయతి దగ్గర డేగ దుర్గయ్య ఇంటి నుండి కొమిరి నేని శ్రీదర్ రావ్ ఇంటి వరకు సిమెంట్ రోడ్డు కోసం పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఏఈ మల్లేష్, ఉపసర్పంచ్ వేణుగోపాల రావు, వార్డు మెంబర్ రక్షిత్, నాయకులు బాసినేని సత్యనారాయణ రావు, మొగిలి విజేందర్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. సిసి రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ , వార్డు సభ్యులు, గ్రామస్తులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.




