Wednesday, 4 November 2026

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే 

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

మల్దకల్ డిసెంబర్ 29 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలంపర్యటనలో గురువారం ఆయా గ్రామాల లబ్ధిదారులకుసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులనుగద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి,జడ్పీ చైర్మన్ సరిత చేతుల మీదుగా పంపిణీ చేశారు.సునీత,
నర్సింహులు,
చిన్న బుచ్చన్న,
సుదర్శన్ రెడ్డి,చెక్కులను అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూపేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరమైన పేద ప్రజలు వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులను సీఎం సహాయ నిధి ద్వారా 50% డబ్బులను రూపంలో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది కరోనా కష్ట సమయంలో కూడా పేద ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.ఆరోగ్య పరిస్థితి బాలేక ఆసుపత్రి లో ఖర్చు పెట్టిన వాటికి సంబంధించిన బిల్లులను సీఎం సహాయనిధి పంపితే సీఎం సహాయం కింద నమోదు చేసుకున్న వారికి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కుల అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్ ,ఎంపీపీ రాజారెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న,మండలరైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,సర్పంచు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.