Thursday, 5 November 2026

పేద వర్గాలకు అండగా డీఎన్ఆర్ – కాంగ్రెస్ నాయకులు.

ఊరుకొండ, జనవరి 18 (జనం సాక్షి):
బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి (డీఎన్ఆర్) అండగా నిలబడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం ఊర్కొండ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన సాకలి శివయ్య(50), గుడిగానిపల్లి గ్రామానికి చెందిన కొమ్ము నారాయణ(50) అనారోగ్యంతో బాధపడుతూ ఆకస్మికంగా మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాదారం సర్పంచ్
ద్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, డి ఎన్ ఆర్ యువసేన సభ్యులు మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తోడ్పాటునిస్తున్న ధ్యాప నిఖిల్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో గుడిగానిపల్లి సర్పంచ్ రజితకృష్ణయ్య,
తిరుపతయ్య, వీరస్వామి, బాలస్వామి, సత్తయ్య, కే.ఇదయ్య, రవి, మాధవ్, బంగారు, చంద్రమౌళి, వెంకటేష్, గణేష్, శ్రీనివాస్, కిష్టయ్య, శేరిబాబా, తదితరులు పాల్గొన్నారు.