బెల్లంపల్లి, జులై, ( జనంసాక్షి )పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా ఇస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ 27 మంది లబ్ధిదారులకు పదమూడు లక్షల నాలుగు వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఏఆపద వచ్చినా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుండి ఆపద తీరుస్తారని అన్నారు. పేదింటి ఆడపడుచుకు కల్యాణలక్ష్మి, పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి, రైతులకు రైతు బందు, రైతు భీమా లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. పేదల మనసు అర్ధం చేసుకొని ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ను ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుదామని అన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య




