Tuesday, 3 November 2026

జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చేయూత

 

 

 

 

 

 

హుజూర్ నగర్ జనవరి 27(జనంసాక్షి): జన చైతన్య ట్రస్టు ద్వారా పేదలను ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని జనచైతన్య ట్రస్ట్ సభ్యులు అన్నారు. శుక్రవారం
హుజుర్ నగర్ పట్టణ పరిధిలోని మల్లనగర్ కు చెందిన ముదిగొండ సైదులు సతీమణి మాధవి కుటుంబం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న విషయం జనచైతన్య ట్రస్ట్ దృష్టికి రావడంతో జనచైతన్య ట్రస్ట్ తరుపున 50కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్బంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ సమాజంలో ఇబ్బందులు పడుతున్న వారిని మా వంతు బాధ్యతగా జన చైతన్య ట్రస్ట్ ద్వారా ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ పౌండర్ పినపారాళ్ళ వంశీ, అధ్యక్షులు పారా సాయి, ఉపాధ్యక్షులు పిల్లి శివశంకర్, సెక్రటరీ దగ్గుపాటి రమేష్, బీవీ శ్రీపతి, కె,సాయి, కాశీవిశ్వనాధ్, వల్లపుదాసు సైదులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.