Monday, 2 November 2026

జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

హుజూర్నగర్ మే 31 (జనంసాక్షి):.పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నందు అత్యవసర పరిస్థితుల్లో గండు నాగమణి అను ఆమెకు బి పాజిటివ్ రక్తం అత్యవసరం కావడంతో బుధవారం జనచైతన్య ట్రస్ట్ ను సంప్రదించగా ట్రస్ట్ నిర్వాహకులు పినపారాళ్ళ వంశీ, తక్షణమే స్పందించి గొట్టి కిరణ్ ను సంప్రదించి రక్తదానం అందించారు.
ఈ సందర్బంగా ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ళ వంశీ మాట్లాడుతూ రక్తం అవసరం వున్నా ప్రతి ఒక్కరికి జన చైతన్య ట్రస్ట్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది అని తెలుపుతూ, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో పారా సాయి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.