జననేతకు జేజేలు పలుకుతున్న మండల ప్రజలు.
– డీఎన్ఆర్ యువసేన సభ్యులు లచ్చిరామ్ నాయక్.
ఊరుకొండ, జనవరి 9 (జనంసాక్షి):
ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ., నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న జననేత, మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డికి మండల ప్రజలు జేజేలు పలుకుతున్నారని డీఎన్ఆర్ యువసేన సభ్యులు రామవత్ లచ్చిరామ్ నాయక్ అన్నారు. సోమవారం ఊరుకొండ మండలంలోని అమ్మపల్లితండాకు చెందిన బిచ్యానాయక్(45) అనారోగ్యంతో బాధపడుతు ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి 5వేల ఆర్ధిక సహాయం యువసేన సభ్యుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా రామవత్ లచ్చిరామ్ నాయక్ మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోస కల్పిస్తూ తనదైన శైలిలో ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నారు. ఇలాంటి నాయకుడు మన మండలంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, డీఎన్ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జననేతకు జేజేలు పలుకుతున్న మండల ప్రజలు.




