Wednesday, 4 November 2026

ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
-జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్.
గద్వాల నడిగడ్డ, జనవరి 9 (జనం సాక్షి);
ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ జిల్లా అధికారులకు ఆదేశించారు.
సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల పై పిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ద్వారా ధరణి 52 , ఆసరా పెన్షన్ 8 , ఆలంపూర్ మండలం క్యాతుర్ గ్రామానికి సంబంధించి డబుల్ బెడ్ రూమ్ లు కావాలని 4 దరఖాస్తులు మొత్తం 64 పిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన భూ సమస్యలు , ఆసరా పెన్షన్ లకు సంబంధించిన పిర్యాదులు అన్నింటిని సంబంధిత శాఖలకు పంపించి , వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని పిర్యాదుదారులకు హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో అర్దిఓ రాములు , ఎ.ఓ యాదగిరి,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.