జనవరి 26న రాజకీయ ఖైదీల అందరిని విడుదల చేయాలి.
జనశక్తి నేత కూర రాజన్న.
సిరిసిల్ల కోర్టుకు రాజన్న.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 06.(జనంసాక్షి). అకారణంగా జైల్లో నిర్బంధించబడ్డ రాజకీయ ఖైదీలందరిని జనవరి 26న విడుదల చేయాలని జనశక్తి నేత కూర రాజన్న కోరారు. శుక్రవారం సిరిసిల్ల కోర్టుకు హాజరైన సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. దేశంలో ఆరు లక్షల పైగా ప్రజల పక్షాన నిలబడిన మేధావులను నాయకులను అక్రమంగా నిర్బంధించారని వ్యక్తం చేశారు. వారిలో ఆదివాసులు గిరిజన కూడా ఉన్నారని తెలిపారు.నిర్బంధించబడ్డ రాజకీయ ఖైదీల అందరు జీవిత ఖైదీలేనని అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ జీవోను తీసుకువచ్చిన 948 మందిని విడుదల చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీల అందరిని జనవరి 26న విడుదల చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జైల్లో మగ్గుతున్న రాజకీయ ఖైదీల హక్కులను కాలరాయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామిక వాదులపై ఉందని తెలిపారు. ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్నను అకారణంగా నిర్బంధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలల నుండి జైలు జీవితం గడుపుతున్న రాజన్నకు నాలుగు నెలల అనంతరం కోర్టులో బెయిల్ మంజూరై విడుదలయ్యే క్రమంలో పాత కేసులు తిరగతోడుతు కుట్ర పురితంగా అక్రమంగా నిర్బానించడం పై ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న ఆరోగ్య పరిస్థితి ఆలోచించి తక్షణం విడుదల చేయాలని కోరారు.




