ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై టెలి కాన్ఫరెన్స్
టేకులపల్లి, జనవరి 6( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ అందిస్తున్న వైద్యారోగ్య సేవలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య ఆరోగ్య సేవల పై టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేసి కంటివెలుగు, మాతా శిశు సంరక్షణ, కెసిఆర్ కిట్ సేవలు,న్యూట్రిషన్ కిట్లు, రక్త హీనత,వ్యాధి నిరోధక టీకాలు తదితర అంశాలపై ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందడానికి సిబ్బందికి తగు సూచనలు చేశారు. టేకులపల్లి మండలంలోని ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది అందరూ ఆస్పత్రి సమావేశం మందిరంలో ఈ టెలికాన్సన్ కి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ దినేష్, పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి, ఆప్తాలమిక్ ఆఫీసర్ సనత్ కుమార్,సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ,సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, గుజ్జ విజయ, వీసం శకుంతల, ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




