డబల్ బెడ్రూమ్స్ ఇవ్వాలంటూ ధర్నా…
భైంసా రూరల్ జనవరి 06 జనం సాక్షి
ముధోల్ బీజేపీసీనియర్ నాయకులు భోస్లేమోహన్ రావ్ పాటిల్ ఆధ్వర్యంలో శుక్రవారం బాసర మండల కేంద్రంలో డబల్ బెడ్రూమ్స్ రాని బాధితప్రజలతో సభను ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడారు….ఖాళీస్థలం ఉండి నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి రావాల్సిన 5 లక్షల రూపాయలసహాయం,మరియు స్థలం కూడా లేని పేదవారికి తక్షణమే డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించాలని అన్నారు.గతరెండుఎన్నికల నుండికెసిఆర్ అబద్ధాలకు పేదప్రజలే బలిఅవుతున్నారని అన్నారు.స్థలంఉన్న పేదలకు డబుల్ బెడ్రూంఇల్లు కట్టిస్తామని,జాగాకూడా లేని పేదలకు తామే ఇల్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చి, తరువాత మళ్ళీ మాట మార్చి 5 లక్షలు ఇస్తామంటూ,దాన్ని కూడా మార్చి ఇప్పుడు 3 లక్షలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి కాలక్షేపం చేస్తున్నారని కెసిఆర్ ప్రభుత్వం పై మండిపడ్డారు.అనంతరం సభాస్థలి నుండి బాసరరైల్వే స్టేషన్ చౌరస్తా శివాజీవిగ్రహ0 వద్దకి వరకుర్యాలీగా వెల్లి రోడ్డుపై మహాధర్నా చేపట్టారు. అర్హులందరికీ డబల్ బెడ్ రూములు ఇవ్వాలంటూ… ఎమ్మార్వో రావాలంటూ నినాదాలుచేస్తూ రోడ్డుపై బైఠాయించారు.బాధితప్రజలతోరోడ్డుపై గంటసమయ0 బైఠాయించారు.ఎన్నికలలో ఇచ్చినడబుల్ బెడ్రూంఇళ్ళ హామీ నేరవెర్చాలని,లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రగతీ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.రోడ్డు పై మహాధర్నాతో దాదాపుగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధర్నా స్థలానికి ఎమ్మార్వో రాకతో డబల్ బెడ్రూమ్ రాని బాధిత ప్రజలను పట్టించుకోవాలంటూ తెలిపారు. ధర్నా విరమించి అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలోముధోల్ తాలూకా పార్లమెంట్ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్,కౌన్సిలర్ కపిల్, దిలీప్, సుభాష్ పటేల్,సాయినాథ్ పటేల్,మనోజ్,కాసరి రామకృష్ణ బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.




