తాడికల్ లో ఘనంగా పోచమ్మ బోనాలుశంకరపట్నం: జనం సాక్షి మార్చి 22
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు ఘనంగా పోచమ్మ బోనాలను మహిళలు పెద్ద ఎత్తున బోనమెత్తుకొని డప్పు సప్పులు జామడికే వాయిద్యాల తో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనమర్పించారు. ఈ సందర్భంగా తాడికల్ ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడుతూవారు ప్రతి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా పోచమ్మ బోనాలు చేస్తున్నట్లు గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లంగా ఉండాలని పోచమ్మ తల్లికి బోనం నైవేద్యం సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీవాసులతోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తాడికల్ లో ఘనంగా పోచమ్మ బోనాలు




