Wednesday, 4 November 2026

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

 

 

 

 

 

ఫొటో : అన్నదానం చేస్తున్న ఎంపీపీ గోమాస శ్రీనివాస్.బెల్లంపల్లి, ఫిబ్రవరి 8, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు. దాతల సహకారంతో ఈకార్యక్రమం గత ఏడాది ఏప్రిల్ 13న ప్రారంభించామని, వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేటితో 158వ సారి అన్నదానం చేసినట్లు తెలిపారు. నేటి కార్యక్రమం ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, జనహిత సేవా సమితి గౌరవ సలహాదారుడు పూదరి లావణ్య నగేష్ గౌడ్ దంపతుల కుమారుడు నిశాంత్ గౌడ్ జన్మదినం సందర్బంగా యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, చిరు వ్యాపారులకు, బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదానం చేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమం ద్వారా సుమారు 180 మందికి అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని, ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్ రావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మోటుపలుకుల రాజశేఖర్, నాయకులు పోలవేణి శ్రీనివాస్, దాత మిత్రులు నరేందుల రామకృష్ణ, బండారి అశోక్ గౌడ్, జనహిత సేవా సమితి సహాయ కార్యదర్శులు పతంగి సంతోష్, దాసరి రంజిత్ గౌడ్, సభ్యులు సింగతి తిరుమల్, నిచ్చకోల గురుస్వామి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.