జనహిత సేవా సమితి కి యువజన పురస్కారం.
బెల్లంపల్లి, జనవరి 12 (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణానికి చెందిన జనహిత సేవా సమితి సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా యువజన పురస్కారం లభించింది. గురువారం స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో జనహిత సేవా సమితి యొక్క సేవలని గుర్తించి మంచిర్యాల జిల్లా యువజన క్రీడా అధికారి బొబ్బిలి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్ ను శాలువా తో సన్మానించి మెమోంటో మరియు ప్రశంసా పత్రం అందజేశారు.
జనహిత సేవా సమితి కి యువజన పురస్కారం




