Thursday, 5 November 2026

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణి

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణి
హుజూర్ నగర్ డిసెంబర్ 28 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని మల్లన్న నగర్ లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి, ముడెం సాయికిరణ్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో జనచైతన్య ట్రస్ట్ ను సంప్రదించి 25 కేజీల బియ్యం అందజేయడం జరిగిందన్నారు. బుధవారం ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ముడెం సాయికిరణ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని తమ పుట్టినరోజులను, తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజులను పది మందికి సేవ చేసే విధంగా ఉపయోగపడేలా ఉండాలని కోరారు. పేదలకు సాయం చేయాలని తలంచి సాయం చేసిన ముడెం సాయికిరణ్ రెడ్డికి ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్: పౌండర్ పినపారాళ్ళ వంశీ, అధ్యక్షులు పారా సాయి, ఉపాధ్యక్షులు పిల్లి శివ, సెక్రటరీ దగ్గుపాటి రమేష్, కోశాధికారి శ్రీపాతి, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మట్టపల్లి రవీందర్, కె. కాశివిశ్వనాధ్, జంజీరాల సైదులు పాల్గొన్నారు.