Thursday, 5 November 2026

పత్తి కి మద్దతు ధర కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

పత్తి కి మద్దతు ధర కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో..
బేల , డిసెంబర్ 28 ( జనం సాక్షి)
పత్తి పంట కు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తు బుధవారం కాంగ్రెస్ పార్టీ అద్వర్యములో అంతర్ రాష్ట్ర రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేశారు.
ఈసందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజూల్లా ఖాన్ మాట్లాడుతూ గత నెల రోజులుగా పత్తి ధర తగ్గిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆరోపించారు. రైతులు పండించిన పత్తి పంట కు గిట్టుబాటు ధర కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సామ రుపేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ రూప్ రావ్,వామన్ వాన్కడే, సంజయ్ గుండా వార్ ,బోక్రే శంకర్,అఖిల్ , రాజు తదితరులు పాల్గొన్నారు..