Thursday, 5 November 2026

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి
హుజూర్ నగర్ జనవరి 10 (జనం సాక్షి): జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను మంగళవారం పంపిణి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జన చైతన్య ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ యాతవాకిళ్ల గ్రామస్తురాలు వేముల లలిత, పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తన భర్త మరణించడంతో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమెకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి, హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా అయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం జనచైతన్య ట్రస్ట్ సభ్యులకు తెలియడంతో
జనచైతన్య ట్రస్ట్ ద్వారా వాటికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో మట్టపల్లి రవీందర్ నిత్యావసర సరుకులు, టీవీఎస్ నున్న.రామారావు 25కేజీల బియ్యం జన చైతన్య ట్రస్ట్ కు డొనేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ ఫౌండర్: పినపరాళ్ల వంశీ, అధ్యక్షులు పారా సాయి, పిల్లి శివశంకర్, దగ్గుపాటి రమేష్, బీవీ శ్రీపతి, ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మట్టపల్లి రవీందర్, మట్టపల్లి నర్సయ్య, వార్డ్ మెంబెర్ రవి, సైదులు, సతీశ్, స్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.