Wednesday, 4 November 2026

40వ వార్షికోత్సవాలకు సిద్ధమైన శ్రీ చాముండేశ్వరి మాత ఆలయం

40వ వార్షికోత్సవాలకు సిద్ధమైన శ్రీ చాముండేశ్వరి మాత ఆలయం….

చిలప్ చేడ్/జనవరి/జనంసాక్షి :- మండలంలోని మంజీర పరివాహక ప్రాంతమైన చిట్కుల్ గ్రామ శివారులో వెలిసినటువంటి శ్రీ చాముండేశ్వరి మాత అమ్మవారి ఆలయం 40వ వార్షికోత్సవాలకు సిద్ధమవుతుంది ఈనెల 12 13 14 తేదీలలో దేవాలయంలొ వార్షికోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి తెలియజేశారు మొదటిరోజు గణపతి హోమం అమ్మవారికి అభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతిరోజు అమ్మవారికి పారాయణం చండీ హోమం కార్యక్రమం ఉంటుంది అలాగే అఖండ దీపారాధన పుణ్యవచనం అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తామని పూజారి తెలియజేశారు శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయం లో 40వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మూడు రోజులపాటు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది శ్రీ చాముండేశ్వరి మాతను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలివస్తారని పూజారులు ప్రభాకర్ శర్మ మోతిలాల్ శర్మ గుర్తు చేశారు ఈ వార్షికోత్సవాలకు అమ్మవారి భక్తులు భారీ భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు అన్నారు