Wednesday, 4 November 2026

12న ముగ్గుల పోటీలు సంప్రదాయ వంటల ప్రదర్శన

12న ముగ్గుల పోటీలు సంప్రదాయ వంటల ప్రదర్శన

 

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గులు , వంటల పోటీలను నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ బెలిదె శ్రీనివాసులు, వాసవి కపుల్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ , వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ కలకోట లక్ష్మయ్య తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12న ఉదయం 9గంటలకు సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ , విశిష్ట అతిథులుగా మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక ప్రకాష్ హాజరు కానున్నట్లు తెలిపారు.ఈ పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ పోటీలలో విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్మన్ మీలా వాసుదేవ్, వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ కలకోట అనిత , వాసవి సుధాకర్ విజన్ క్లబ్ ప్రెసిడెంట్ సోమా పద్మ ,వాసవి కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ తొణుకునూరు సంతోష్ ,వాసవి ఎన్ఆర్ఐ ఫ్యామిలిస్ క్లబ్ ప్రెసిడెంట్ పసుపర్తి కృష్ణమూర్తి , ఐపిసి ఆఫీసర్ బిక్కుమళ్ల కృష్ణ , చల్లా లక్ష్మి, పసుపర్తి జ్యోతి, తల్లాడ శ్రీనివాస్, దాచేపల్లి సత్యనారాయణ, జూలకంటి నాగరాజు,భోనగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.