భువనగిరి టౌన్ జనం సాక్షి:– యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలో పెద్ద చెరువు కట్టకింద నూతన ఈద్గా ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర హోమ్ మరియు రెవిన్యూ శాఖ మాత్యులు మహమూద్ అలీ , వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లా ఖాన్ లు భువనగిరి పట్టణానికి విచ్చేసి స్థానిక శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి లతో కలిసి పట్టణంలోని చెరువు కట్ట సమీపంలో ఉన్న వక్ఫ్ బోర్డ్ స్థలం లో నూతన ఈద్గా కోసం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2014 తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ సర్వ మతాల అభివృద్ధి శాంతియుత వాతావరణం లో మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు రూపొందించారు.
తెలంగాణ లో కబ్జాలకు గురవుతున్న భూములను పరిరక్షించాలని ప్రత్యేక జీవో తీసుకువచ్చి వక్ఫ్ భూములను రక్షించిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని తెలియజేశారు.భువనగిరి పట్టణంలో కూడా కబ్జాకు గురైన భూమిని ముఖ్యమంత్రి మరియు హోమ్ శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్ల గానే ఈ భూమిపై రెవిన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ భూమిని రక్షించి మైనార్టీలకు కానుకగా ఇవ్వడం జరిగిందని దీనికి ముఖ్యమంత్రి గారికి హోమ్ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను అని అన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ అహ్మద్ అజీముద్దీన్ , అడ్వకేట్ రహీం, టిఆర్ఎస్ పట్టణ నాయకులు కిరణ్. శ్రీనివాస్ రెడ్డి పాండు, ఇర్బాల్, మైనార్టీ నాయకులు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
నూతన ఈద్గా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ హోమ్ శాఖ మాత్యులు మహమూద్ అలీ భువనగిరి శాసనసభ్యులు




