Wednesday, 4 November 2026

నిరుపేదకు నిత్యావసర సరుకుల పంపిణీ

 

 

 

 

 

 

 

జనం సాక్షి , మంథని : సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంథని పట్టణం లోని గొబ్బూరి మాధురి – వంశీ పెళ్లిరోజు సందర్భంగా మంథని పట్టణం లోని 3వ వార్డ్ అంబేద్కర్ నగర్ లోని బాడికల రాజేశ్వరి అనే నిరుపేద మహిళకు నిత్యవసర వస్తువులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మేడాగోని వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ బొడ్డు సతీష్, కార్యదర్శి బుద్ధర్తి సతీష్ కుమార్, కోశాధికారి కొమురోజు సురేష్ సభ్యులు రాపర్తి అఖిల్, ఏల్పుల సామ్రాట్ పాల్గొన్నారు.