Tuesday, 3 November 2026

జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకొని , జాతరలో పోలీస్ భద్రతను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

 

 

 

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 7 (జనం సాక్షి);పౌర్ణమి తరువాత తొలి మంగళవారము జరుగుతున్న జమ్మిచెడు జమ్ములమ్మ జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ కె. సృజన జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీ కి ఆలయ చైర్మన్ సతీష్ కుమార్, ఈ. ఓ కవిత స్వాగతం పలికారు.పౌర్ణమి తరువాత తొలి మంగళవారము జరిగే జాతరకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి బారి సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ను జిల్లా ఎస్పీ పర్యవేక్షించి భక్తుల క్యూ లైన్స్, ట్రాఫిక్ మళ్లింపు కు సంబంధించి పోలీస్ అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పి జే పి క్యాంప్ నందు కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని ఎస్పీ సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రధాన కార్యాలయం ముందు గార్డెన్ , పౌంటెన్, ఎస్పీ రెసిడెన్సీ, క్యాంప్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
ఎస్పీ వెంట డి. ఎస్పీ ఎన్. సి హెచ్ రంగ స్వామి, సాయుధ దళ డి. ఎస్పీ ఇమ్మనియోల్,
ఎస్బి ఇన్స్పెక్టర్ శివ కుమార్,గద్వాల్ సి. ఐ చంద్ర శేఖర్, అర్. ఐ నగేష్ ,రూరల్ ఎస్సై ఆనంద్ తదితరులు ఉన్నారు