జమ్మూ, కశ్మీర్, ఫిబ్రవరి 4 : జమ్మూకశ్మీర్ ను భారీ హిమపాతం ముంచెత్తింది. దీంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. కశ్మీర్ లోయలో విపరీతంగా మంచు కురుస్తుండటంతో… 294 కిలోమీటర్ల పొడవైన శ్రీనగర్ – జమ్మూ హైవేను మూసివేశారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టులో 12 విమాన సర్వీసులను రద్దుచేశారు.
గుల్మర్గ్ లో రెండు అడుగుల మందంలో మంచు కురిసింది. మంచు విపరీతంగా కురుస్తుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మంచు ముసురుతో కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా విలవిలలాడుతోంది. మంచు గడ్డలను తొలగించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. పూంజ్ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాజౌరీలో హైవే మీద మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.




