తమ జైల్లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులకు మరణ శిక్ష
జోర్డాన్‌ౖ, ఫిబ్రవరి 4 : తమ దేశపు పైలట్ మువాత్‌ను ఐసీస్ ఉగ్రవాదులు హతమార్చినందుకు జోర్డాన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంది. తమ దేశంలో నిర్బంధంలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులకు బుధవారం ఉదయమే ఉరి శిక్ష అమలు చేసింది. ఇరాక్‌కు చెందిన సాజిదా ఆల్‌ఖైదాలో మహిళా ఉగ్రవాది 2005లో జోర్డాన్‌లో 60 మంది ప్రాణాలు తీసిన బాంబు దాడి కేసులో నేరస్తురాలు. ఆమెకు జోర్డాన్ కోర్టు మరణ శిక్ష విధించింది.
మరోక ఆల్‌ఖైదా ఉగ్రవాది కార్గోలీ కూడా ఒక జోర్డాన్ వాసిని హతమార్చిన కేసులో నేరస్తుడు 2005లో అతని నేరం నిరూపణ అయింది. వారిద్దరికీ బుధవారం ఉదయం ఉరిశిక్ష అమలు చేశారు. ఐసీస్ ఉగ్రవాదులు తమ పైలట్‌ను హతమార్చినందుకు ప్రతీకారంగానే వీరిద్దరికి ఉరి శిక్ష అమలు చేసినట్లు జోర్డాన్ ప్రభుత్వం ప్రకటించింది.




