Wednesday, 4 November 2026

జయహో జనయిత్రీ… స్త్రీ శక్తికి సాటేది

 

 

 

 

 

టేకులపల్లి,మార్చి 8( జనం సాక్షి ): స్త్రీ లేకపోతే జననం లేదు గమనం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదని జయహో జనయత్రి స్త్రీ శక్తికి మరొకటి సాటి లేదని తెలుపుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు టేకులపల్లి లోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగాటేకులపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బానోతు లక్ష్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యా వైద్యం క్రీడలు వ్యాపారం రాజకీయం అంతరిక్ష పరిశోధన లాంటి అనేక రంగాలలో ప్రతిభలను చాటుతూ విజయాలను అందిస్తున్న మహిళల ఫోటోలను ప్రదర్శిస్తూ విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళలను గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడం తో సమానమన్నారు.