టేకులపల్లి, మార్చి 8( జనం సాక్షి): ప్రపంచంలోనే భారత సంస్కృతిలో స్త్రీకి అత్యున్నత స్థానం కల్పించబడిందని, దీనిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మండల వైద్యాధికారిడాక్టర్ కందుల దినేష్ అన్నారు. బుధవారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం చేయడంలో నర్సులమ్మ లదే ముఖ్యపాత్రని, ప్రపంచాన్ని వణికించిన కరోనా లాంటి భయంకరమైన ఎపిడమిక్ సమయంలో కూడా మహిళా వైద్య సిబ్బందిదే కీలక పాత్రని, వారి సేవలను సమాజం ఎప్పటికీ మరిచిపోదని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ,పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి, పల్లె దవాఖాన వైద్యులు ఇంద్రజ, శైలజ, నిహారిక, శ్రావణి, పావని, చందు,సూపర్వైజర్లు గుజ్జ విజయ, వీసం శకుంతల, పోరండ్ల శ్రీనివాస్,నాగు బండి వెంకటేశ్వర్లు, వేదమణి, ఏఎన్ఎంలు ఫాతిమా,ఎల్లమ్మ,లలిత,రమా కుమారి,కమల, మానస, సైదమ్మ,కళావతి,నాగలక్ష్మి, పరంగిణి, సుజాత,సాజిదా బేగం తదితరులు పాల్గొన్నారు.




