Wednesday, 4 November 2026

టేకులపల్లి మండలంలో ఘనంగా హోలీ వేడుకలు

 

 

 

 

 

 

 

 

టేకులపల్లి, మార్చి 7 (జనంసాక్షి): రంగుల కేళీ ఆనందాల హోలీ పర్వదిన సందర్భంగా బుధవారం టేకులపల్లి మండలంలో గ్రామ గ్రామాన యువకులు, యువతలు, పిల్లలు ఆనందోత్సాహాలతో రంగులు పూసుకుని, నీళ్లు ఒకరిపై ఒకరు గుమ్మరించుకుంటూ కేరింతల కొడుతూ ఘనంగా హోలీ వేడుకలను, హోలీ సంబరాలను అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో టేకులపల్లి, బోడు, కొప్పురాయి, బేతంపూడి, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, కోయగూడెం, సులానగర్, ముత్యాలంపాడు, బొమ్మనపల్లి, మద్రాస్ తండా, తడికలపూడి, 9వ మైలు తండా, కుంటల, దాస్ తండా, రేగుల తండా, సీతారాంపురం స్టేజి తదితర గ్రామాలలో యువకులు ఎంతో ఉత్సాహంగా హోలీ సంబరాలు ముమ్మరంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో యువ సర్పంచులు మాలోతు సురేంద్రనాయక్, మాలోత్ రాజేంద్ర నాయక్, రంగులు చల్లుకుంటూ యువకులతో రంగోలి ఆడారు.