జయ పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను సోమవారం జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయ బ్లాసమ్స్ చిన్నారులు దేవతామూర్తుల అవతారాలతో, పలువురు జాతీయ నాయకుల వేషధారణలతో వేడుకలలో పాల్గొని సందడి చేశారు.భారతమాత , తెలంగాణ తల్లి, చాచా నెహ్రూ వేషధారణలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అనంతరం చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను అందజేశారు.ఈ వేడుకలలో పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ , డైరెక్టర్లు జెల్లా పద్మ , బింగి జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




