Wednesday, 4 November 2026

జర్నలిస్టులకు అండగా టియుడబ్ల్యూజే. -తెలంగాణలోనే అతిపెద్ద యూనియన్.

-జర్నలిస్టులకు అండగా టియుడబ్ల్యూజే.
-తెలంగాణలోనే అతిపెద్ద యూనియన్.
-ద్వితీయ మహాసభలకు 5వేల మంది జర్నలిస్టులు.
-8 న పఠాన్ చేరు లో భారీ మహాసభ.
-మహాసభలకు జర్నలిస్టులు కదం తొక్కాలి.
-టీయుడబ్ల్యూజే రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జనవరి 6(జనంసాక్షి):
తెలంగాణలో జర్నలిస్టులకు అండగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిలిచిందని టియుడబ్ల్యూజే రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ అన్నారు. ఈనెల 8వ తేదీన హైదరాబాద్ లోని పటాన్ చెరువు జివిఆర్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర ద్వితీయ మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ టి యు డబ్ల్యూ జే ప్రస్థానం మొదలైన నాటి నుంచి జర్నలిస్టులకు అండగా నిలుస్తూ వచ్చిందన్నారు. మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు అల్లం నారాయణ సారథ్యంలో యూనియన్ అంచలంచలుగా ఎదుగుతూ జర్నలిస్టులకు అండగా నిలుస్తుంది అన్నారు.మీడియా అకాడమీ ద్వారా మృతి చెందిన ప్రతి జర్నలిస్టుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ప్రతినెల 3000 రూపాయల పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దీంతోపాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పడి ఉద్యమంలో తమ వంతు పోరాటాన్ని సాగించిందన్నారు. పరిణామ క్రమంలో క్రమంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణలో టీయూడబ్ల్యూజే గా అవతరించి ఐదువేల పైచిలుకు సభ్యత్వాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద జర్నలిస్టు సంఘంగా నిలుస్తుంది అన్నారు. దీంతోపాటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) పదవ ప్లీనరీ నీ హైదరాబాద్ లో జరుపుకోవడం మన అదృష్టం అన్నారు.భవిష్యత్తులో జర్నలిస్టులకు అండగా నిలుస్తూ యూనియన్ కార్యకలాపాలను ముందుకు తీసుకు వెళ్తామని అబ్దుల్లా ఖాన్ అన్నారు. ఈ నెల 8వ తేదీన పటాన్ చెరువులో జరిగే ఐజేయు ద్వితీయ మహాసభలకు జర్నలిస్టులు కదం తొక్కాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు దినకర్ రావు, జిల్లా నాయకులు చంద్రశేఖర్ రావు, తిప్పర్తి విజయ్, అహ్మదుల్లా ఖాన్, రాజేష్ గౌడ్, ఖానాపురం ప్రదీప్, శ్రీనివాస్ గౌడ్,ఏటిగడ్డ వెంకటేష్,రమేష్, పాలాది యాదయ్య, కపిలవాయి రాజు తదితరులు పాల్గొన్నారు.