హైదరాబాద్ యూత్ అసెంబ్లీ వారి సౌజన్యంతో వాటర్ ప్లాంట్ విరాళము.
మర్పల్లి జనవరి 06(జనం సాక్షి) శుక్రవారం రోజున హైదరాబాద్ యూత్ అసెంబ్లీ వారు మర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పిల్లల త్రాగునీటి సౌకర్యం కోసం ఆర్వో వాటర్ ప్లాంట్ ను విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ చైర్మన్ లాస్య, డైరెక్టర్ కార్తీక్, కోశాధికారి మిథీష్, లాజిస్టిక్ సభ్యుడు ఇస్మాయిల్, మండల విద్యాధికారి విద్యాసాగర్, పాఠశాల చైర్మన్ మనోహర్, ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం, ఉపాధ్యాయులు నీలకంఠం, సంగప్ప, తదితరులు పాల్గొన్నారు.




